News February 7, 2025

యాదాద్రి: యువతకు ఉచిత శిక్షణ..

image

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామంలో స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ లక్ష్మీ తెలిపారు. ఎలక్ట్రిషన్, సోలార్ సిస్టం ఇన్స్టలేషన్ & సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సీసీటీవీ టెక్నీషియన్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోసి తదితరాలపై ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News February 25, 2026

కార్మికులకు గుడ్ న్యూస్: 40 దాటితే హెల్త్ చెకప్!

image

40 ఏళ్లు దాటిన కార్మికులందరికీ ఇకపై ఫ్రీ మెడికల్ టెస్ట్‌లు తప్పనిసరి కానున్నాయి. ESIC 75వ వేడుకల్లో మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయం చెప్పారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచి రిఫరల్స్ తగ్గించాలని అధికారులకు సూచించారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకంతో ESICని అనుసంధానించేలా ఒప్పందం చేసుకున్నారు. కార్మికుల ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుందని, ESIC సేవలు ఎయిమ్స్ (AIIMS) స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.

News February 25, 2026

నంద్యాల జిల్లాలో తాగునీటి కొరత లేకుండా చర్యలు: కలెక్టర్

image

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, సంజామల, ఆత్మకూరు మండలాల్లో చేతిపంపుల మరమ్మతుల కోసం పంపిన ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించి పనులు పూర్తి చేయాలన్నారు. వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించి సమగ్ర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

News February 25, 2026

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

TG: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం తెలంగాణ వ్యాప్తంగా 1,495 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సెంటర్‌కు స్టూడెంట్స్ గంట ముందే చేరుకోవాలి. అయితే పరీక్ష స్టార్ట్ అయిన ఐదు నిమిషాల వరకు లోపలికి అనుమతించనున్నారు. సెంటర్లను CCTV కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు.