News February 6, 2025

యాదాద్రి: రైతు భరోసా నిధులు జమ

image

భువనగిరి జిల్లాలో ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమాయ్యాయి. యాదాద్రి జిల్లాలో మొత్తం 78,795 మంది రైతులకు గాను రూ.46,44,93,195 రూపాయల రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమయ్యాయి. గత ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.5వేలు జమ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఒక ఎకరాకు 6000 రూపాయలను జమ చేస్తోంది.

Similar News

News February 6, 2025

హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట

image

గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ కేసును కొట్టి వేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని అధికారులను ఆదేశించింది.

News February 6, 2025

రాజన్న సిరిసిల్ల: మహిళ ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అరెస్ట్..

image

స్నానం చేస్తుండగా మహిళ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఓ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడని బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

News February 6, 2025

శ్రీకాళహస్తి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై కత్తితో దాడి

image

తొట్టంబేడు (మం) కన్నలి ST కాలనీలో బుధవారం రాత్రి కాంతారావు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు. పొయ్యి కొత్తూరుకు చెందిన కాంతారావు కన్నలి ST కాలనీకి చెందిన లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి మధ్య గొడవలు కాగా లావణ్య పుట్టింటికి వచ్చింది. బుధవారం మళ్లీ గొడవపడిన కాంతారావు కత్తితో లావణ్యపై దాడి చేశాడు. అడ్డం వచ్చిన లావణ్య అక్క సుకన్య, చెల్లెలు సుభాషిణిపై దాడి చేశాడు.

error: Content is protected !!