News March 11, 2025
యాదాద్రి: రోడ్డు పక్కన ఆడ శిశువు మృతదేహం

యాదాద్రి భువనగిరి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. యాదగిరిపల్లిలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రోడ్డు ప్రక్కన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఆడ శిశువు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 13, 2025
ప.గో: వైసీపీలో ఆరుగురికి కీలక పదవులు

వైసీపీ రాష్ట్ర కార్యవర్గంలో పలువురిని కార్యదర్శులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. పేరిచర్ల విజయ నరసింహారాజు, ముప్పిడి సంపత్ కుమార్, యడ్ల తాతాజీ, కొట్టు నాగేంద్ర (పశ్చిమగోదావరి ), నూకపెయ్యి సుధీర్ బాబు, డీ వీ ఆర్ కే. చౌదరి (ఏలూరు) నియమితులయ్యారు.
News November 13, 2025
సంగారెడ్డి: టెన్త్ ఫీజు గడువు నేడే లాస్ట్.!

పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు నేటితో (గురువారం) ముగియనున్నట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇంకా ఫీజు చెల్లించని వారు సాయంత్రంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 13, 2025
తిరుపతి: పర్చేసింగ్ కమిటీనే కీలకం…?

TTD మాజీ EO ధర్మారెడ్డిని నెయ్యి కొనుగోలు, పర్చేసింగ్ కమిటీ పాత్రపై SIT అధికారులు ప్రధాన అస్త్రాలు స్పందించినట్లు సమాచారం. పర్చేసింగ్ కమిటీలోని ఐదుగురు నిర్ణయం తీసుకోవాలా? ఒక్కరు తీసుకున్నా సరిపోతుందా అనే ప్రశ్నలు లేవనెత్తారట. నెయ్యి టెండర్ విధానంలో ధర ఎక్కువ ఉన్న నాణ్యమైన నెయ్యి సరఫరా చూడాలా, తక్కువ ధర చూడాలా అనే ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. తనిఖీలు ఎందుకు చేయలేదని ప్రశ్నలు సంధించారని సమాచారం.


