News March 15, 2025
యాదాద్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి (UPDATE)

యాదాద్రి జిల్లా ఆత్మకూర్‌ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద <<15765722>>రోడ్డుప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తిమ్మాపురం గ్రామానికి చెందిన రమేష్ (34) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 18, 2026
కామారెడ్డి జిల్లాలో స్థిరంగా ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎల్పుగొండ, రామలక్ష్మణపల్లి 15°C, జుక్కల్ 15.1, గాంధారి, మేనూర్ 15.3, లచ్చపేట 15.6, నాగిరెడ్డిపేట, మాచాపూర్ 15.8, పెద్దకొడప్గల్ 15.9, రామారెడ్డి 16, బిచ్కుంద 16.2, ఇసాయిపేట, డోంగ్లి 16.3, సర్వాపూర్ 16.4, పాత రాజంపేట 16.5, నస్రుల్లాబాద్ 16.8°C లుగా నమోదయ్యాయి.
News February 18, 2026
BREAKING: రూ.5వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా సిల్వర్ రేటు మాత్రం తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,60,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,54,200, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,41,350గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 18, 2026
చిత్తూరు DMHOగా డా.నాగశశి భూషణ్ రెడ్డి

చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నాగశశి భూషణ్ రెడ్డిని నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ముగ్గురు జిల్లా వైద్యాధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో DIO అధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగ శశి భూషణ్ రెడ్డిని DMHOగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. త్వరలో ఈయన బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిపారు.


