News January 12, 2026

యాదాద్రి: వారిపై క్రిమినల్ కేసులు: కలెక్టర్

image

సాంకేతికత దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం చట్ట విరుద్ధమని, జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించి జమ చేసిన ఫైల్స్ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై విచారణకు అదేశించారు.

Similar News

News February 10, 2026

రణ్‌వీర్‌ సింగ్‌‌కు బెదిరింపులు

image

బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను బెదిరిస్తూ దుండగులు వాయిస్ మెసేజ్ పెట్టినట్టు తెలుస్తోంది. రూ.కోట్లలో డబ్బులు డిమాండ్ చేస్తూ వాట్సాప్‌లో మెసేజ్ చేశారని సమాచారం. దర్యాప్తు మొదలుపెట్టిన ముంబై పోలీసులు రణ్‌వీర్ సింగ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ దర్యాప్తు చేస్తున్నారని టాక్. రణ్‌వీర్ హీరోగా నటించిన ధురంధర్ సినిమా రూ.1300 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది.

News February 10, 2026

వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుంచి పోలవరం, అల్లూరి జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. జిల్లాలో నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో భూసార పరీక్షలు నిర్వహించాలన్నారు. సారవంతమైన నేలలు గుర్తించి, నూతన పంటల సాగు, విస్తీర్ణాన్ని పెంచే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.

News February 10, 2026

HYD: దోమలు నిద్రపోనివ్వడం లేదు!

image

సిటీలో IT అంటే సాఫ్ట్‌వేర్ అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు అది ‘ఇంటెన్సివ్ టెర్రర్’గా మారింది. మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో దోమల దండయాత్ర మామూలుగా లేదు. 2024లో ఇక్కడి గేటెడ్ కమ్యూనిటీలు ప్రైవేట్ ఫాగింగ్ కోసం నెలకు లక్షన్నర ఖర్చు చేస్తే ఇప్పుడు మూడున్నర లక్షలకు చేరింది. పేరుకే హైటెక్ సిటీ కానీ.. పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్లు దోమల ఫ్యాక్టరీలుగా మారాయి. మున్సిపల్ మందులకు ఈ దోమలు చావట్లేదట మరి!