News March 11, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. సోమవారం 1,356 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.67,800, ప్రసాదాలు రూ.9,64,760, VIP దర్శనాలు రూ.7,80,000, బ్రేక్ దర్శనాలు రూ.2,25,000, వ్రతాలు రూ.1,20,600, కార్ పార్కింగ్ రూ.1,79,500, యాదరుషి నిలయం రూ.52,858, సువర్ణ పుష్పార్చన రూ.56,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.28,46,968, ఆదాయం వచ్చింది.
Similar News
News July 5, 2025
సిద్దిపేట: ‘విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి’

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. గజ్వేల్ పాత సయ్యద్ హాసిమ్ ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
News July 5, 2025
రణస్థలం: ఏడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ విశాఖలోని రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను శుక్రవారం తన గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.
News July 5, 2025
హత్యాయత్నం కేసు.. నిందితులకు 5 ఏళ్ల కఠిన కారాగారం

పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో జగిత్యాల అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి వెంకటమల్లిక్ నిందితులైన తోట నారాయణ (32), తోట మారుతి (35), ఆయన భార్య తోట జ్యోతికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1500/- చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.