News March 19, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్ రూ.2,07,244,VIP దర్శనాలు రూ.1,65,000, బ్రేక్ దర్శనాలు రూ.1,57,200, ప్రసాద విక్రయాలు రూ.8,77,450,కళ్యాణకట్ట రూ.40,000, అన్నదాన విరాళాలు రూ.43,609 సువర్ణ పుష్పార్చన రూ.52,916 కార్ పార్కింగ్ రూ.2,06,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.21,14,642 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

Similar News

News September 17, 2025

కృష్ణా: రైలులో గంజాయి అక్రమ రవాణా.. ఒకరి అరెస్ట్

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో, బిలాస్‌పూర్ నుంచి తిరుపతి వెళ్లే రైలులో 4.5 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని రామవరప్పాడు రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడిని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఒరిస్సాలోని చాట్ల గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి, చిత్తూరు జిల్లాలో విక్రయిస్తున్నట్లు అతడు తెలిపాడు.

News September 17, 2025

మేడారానికి ఓకే విడతలో రూ.150 కోట్లు: సీతక్క

image

ములుగు జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతరకు ఒకే విడతలో రూ.150 కోట్లు, రోడ్లకు రూ.50 కోట్లు ఇచ్చారని తెలిపారు. ములుగు పట్టణంలో పంచాయతీ రోడ్లకు రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అధికారులు ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.

News September 17, 2025

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

image

మాచర్లలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం చేశారు. పర్యటనను విజయవంతం చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, అందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.