News February 26, 2026

యాదాద్రి: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

Similar News

News February 26, 2026

కాజీపేటలో కల్తీ ఐస్ క్రీం స్వాధీనం

image

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురిలో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కల్తీ ఐస్‌క్రీంలతో పాటు గడువు తీరిన రూ.60,400 విలువలైన 12 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ACP మధుసూదన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామాగ్రిని విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.

News February 26, 2026

చీకటి గుహలో చైతూ వేట.. ‘వృషకర్మ’ క్రేజీ అప్‌డేట్

image

నాగచైతన్య హీరోగా వస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్‌ మార్చి 5న విడుదల కానుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ ట్రెజర్ హంటర్‌గా కనిపిస్తున్నారు. బ్రహ్మగిరి పర్వతాల్లో నిధి అన్వేషణ, అక్కడి మార్మిక ప్రపంచం చుట్టూ ఈ కథ సాగుతుంది. తాజా పోస్టర్‌లో చైతూ సీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.

News February 26, 2026

సిద్దిపేట: 3,887 ఎకరాల్లో పంట నష్టం

image

సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు 40 గ్రామాల్లోని 1,998 మంది రైతులు నష్టపోయారు. మొత్తం 3,887 ఎకరాల్లో మొక్కజొన్న(2,356 ఎకరాలు), సన్‌ఫ్లవర్(1,531 ఎకరాలు) పంటలు దెబ్బతిన్నాయి. తొగుట మండలంలో డీఏవో స్వరూప రాణి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. ఈ నివేదికను కలెక్టర్‌కు సమర్పించి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాధితులను ఆదుకుంటామని ఆమె రైతులకు హామీ ఇచ్చారు.