News March 21, 2025
యాదాద్రి: 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువ కెరటం!

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు ఏలే నరసింహ-పారిజాతల కుమారుడు ఏలే సుభాష్ చంద్రబోస్ చదువుల్లో ప్రతిభ కనబరుస్తూ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. పురావస్తు శాఖ, రైల్వే శాఖ, పోస్టల్ అసిస్టెంట్, గ్రూప్-4 మున్సిపల్ శాఖలో ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల SSC-CGLలో మంచి ర్యాంక్ సాధించి కేంద్ర రక్షణ శాఖలో ఆడిటర్ ఉద్యోగమూ దక్కించుకున్నాడు.
Similar News
News March 28, 2025
JNTUలో 70.41% పాస్ అయ్యారు

JNTU పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ (R 18 రెగ్యులేషన్)పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. 28,480 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 27,533 విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 19,385 మంది అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించారు. 70.41% పాస్ పర్సంటేజ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. ఫలితాలను JNTUH వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.
News March 28, 2025
విజయనగరం: డివిజన్ల పనితీరుపై సమీక్ష

విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీ పోస్టల్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్(DPS) కె.సంతోష్ నేత గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం రీజియన్ పరిధిలోని విజయనగరం,పార్వతీపురం,అనకాపల్లి,శ్రీకాకుళం డివిజన్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పొదుపు, ఇన్సూరెన్స్ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సత్కరించారు. సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
News March 28, 2025
IPL: పాపం కావ్య

సీజన్ తొలి మ్యాచ్‌లో 286 రన్స్ చేసి భారీగా అంచనాలు పెంచేసిన SRH రెండో గేమ్‌లో చతికిలపడింది. LSG చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో అభిమానులతో పాటు ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ డీలా పడిపోయారు. నిన్న స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఆమె పలికించిన హావభావాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పాపం కావ్య పాప’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.