News September 23, 2025
యాదాద్రీశుడి హుండీలో విదేశీ కరెన్సీలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించగా, పది విదేశాల కరెన్సీలు వచ్చినట్లు ఈఓ వెంకట్రావు తెలిపారు. అమెరికా నుంచి $540, ఇంగ్లాండ్ £95, నేపాల్ రూ.10, సౌదీ అరేబియా 6 రియాళ్లు, ఒమాన్ 401 రియాళ్లు, మలేసియా 40 రింగిట్లు, యూరో €5, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 155 దిర్హామ్‌లు, కెనడా $70, ఇరాక్ నుంచి 250 దినార్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News September 23, 2025
ఐఐఆర్ఎస్ఆర్ ఏర్పాటు ఇంకెప్పుడూ….?

టిష్యూ కల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేసి ఎర్రచందనాన్ని తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఇచ్చే మొక్కగా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖ 2022లో నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఎర్రచందన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంజూరు చేసినప్పటికీ, అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ల్యాబ్‌లో పరిశోధన దశలో ఉన్న ఎర్రచందనాన్ని రైతులు పెంచుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
News September 23, 2025
విశాఖలో రెండో రోజు జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు

నగరంలోని నోవాటెల్ హోటల్‌లో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు రెండో రోజు కొనసాగింది. సదస్సులో భాగంగా ‘సివిల్ సర్వీసెస్ & డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’ అంశంపై మూడో ప్లీనరీ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సెక్రటరీ రష్మీ చౌదరి ప్రధాన వక్తగా వ్యవహరించారు. చర్చలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు పునీత్ యాదవ్, మోహన్ ఖంధార్, అహ్మద్ బాబు, ఎస్.సాంబశివరావు, పీయూష్ సింగ్లా పాల్గొన్నారు.
News September 23, 2025
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు 3,01,321 క్యూసెక్కుల

SRSP నుంచి 3,01,321 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 వరద గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు అధికారులు చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి 1,52,225 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 72.23 TMCల నీరు నిల్వ ఉంది.