News January 28, 2025
యానం పురపాలక సంఘంలో నలుగురు ఉద్యోగులపై వేటు

కేంద్రపాలిత ప్రాంతమైన యానం పురపాలక సంఘంలో పనిచేస్తున్న నలుగురు బిల్ కలెక్టర్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. యానంలోని రిక్రియేషన్ క్లబ్బులకు ట్రేడ్ లైసెన్సుల మంజూరు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన పుదుచ్చేరి పట్టణ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ సౌందర్యరాజన్ వారిపై చర్యలకు ఆదేశించారు. ఒకేసారి నలుగురు ఉద్యోగులు సస్పెండ్ కావడం యానంలో కలకలం రేపుతోంది.
Similar News
News November 5, 2025
పేదలను ఓటు వేయనీయకండి: కేంద్ర మంత్రి

ఎన్నికల రోజు పేదలను పోలింగ్ బూత్‌కు రాకుండా అడ్డుకోండి అంటూ కేంద్రమంత్రి, JDU నేత రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బిహార్‌లోని మొకామాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘పేదలను ఓటు వేయకుండా అడ్డుకోండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో వైరలవ్వడంతో పట్నా జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.
News November 5, 2025
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 పోస్టులు

<
News November 5, 2025
కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


