News April 15, 2025
యానాం: గవర్నర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం, కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. నిన్న గవర్నర్ కైలాస్ నాథన్ పలు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో బాంబ్ స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేసింది. బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫేక్ మెయిల్‌పై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News September 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 16, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.30 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 16, 2025
VZM: మహిళల ఆరోగ్య పరిరక్షణకు వరం

మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకం ఎంతో దోహదం చేస్తుందని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. ఈ పథకానికి సంబంధించి గోడ పత్రికను ఆయన కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. దీని ద్వారా వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి, అవసరమైనవారికి తగిన వైద్య సదుపాయాన్ని అందించాలని సూచించారు.
News September 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.