News December 18, 2025

యారాడ తీరానికి కొట్టుకొచ్చిన భారీ వేల్ సార్క్ చేప

image

విశాఖలోని యారాడ సాగర్ తీరానికి 3 టన్నుల బరువైన వేల్ సార్క్ చేప కొట్టుకొచ్చింది. ఫారెస్ట్ రేంజ్ ఎస్ఐ వెంకట శాస్త్రి తన సిబ్బందితో తీరానికి చేరుకొని పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. చాలా అరుదుగా కనిపించే ఈ సార్క్ చేప మత్స్యకారుల వలకు చిక్కుకొని చనిపోయిందా? లేదా మరేదైనా కారణమా అని విచారణ చేస్తున్నారు.

Similar News

News January 2, 2026

IIIT పుణేలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>IIIT <<>>పుణే 17 అడిషినల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంటెక్(CS&Engg.), PhD (ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్ Engg., అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iiitp.ac.in

News January 2, 2026

ముస్తాఫిజుర్ IPLలో ఆడతారా? BCCI రిప్లై ఇదే?

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస <<18733577>>దాడుల<<>> నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను IPLలో ఆడించొద్దన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే బంగ్లా ప్లేయర్లను బ్యాన్ చేయాలంటూ కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని BCCI ప్రతినిధి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించాలని KKR, ఆ టీమ్ ఓనర్ షారుఖ్ ‌ఖాన్‌‌ను పలువురు హిందూ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.

News January 2, 2026

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏఎస్‌ఎఫ్, కేజడ్ఆర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. కమిషనర్లు, నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.