News December 29, 2025
యాసంగి ప్రారంభంలోనే రైతన్నకు కష్టాలు!

అన్నదాతలకు యాసంగి ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. గత 15 రోజులుగా జిల్లాలో ఉష్ణోగత్రలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. దీంతో వరి నాటు వేసిన పొలాలు చలికి దెబ్బతింటున్నాయి. జిల్లా వ్యాప్తంగా రబీలో 5,64,678 ఎకరాల్లో వరి, వేరుశనగ ఇతర రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కాగా వేసిన నాట్లు ఏమాత్రం ఎదగకపోగా చలి తీవ్రతకు నాటంతా చనిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News December 31, 2025
నల్గొండ: ‘ఇలా’ వచ్చి.. ‘అలా తనదైన ముద్ర వేశారు’

14 నెలల పదవీకాలంలో కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి జిల్లాలో తనదైన ముద్రవేశారు. 2024 అక్టోబరు 28న ఇలా త్రిపాఠి కలెక్టర్‌గా నియమితులయ్యారు. నిత్యం జిల్లాలో ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో మమేకమవడమే గాక పలు పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా విద్యాభివృద్ధి, మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల కోసం ఆమె ప్రత్యేకంగా కృషి చేశారు.
News December 31, 2025
NLG: రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు బదిలీ

నల్గొండ జిల్లాలోని రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. 2023 డిసెంబర్ నాటికి కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణణ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మరుసటి నెలలోనే బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన హరిచందన, ఆ తర్వాత నియమించిన నారాయణరెడ్డి కూడా ఎక్కువ కాలం పని చేయలేదు. ఆయన స్థానంలో ఇలా త్రిపాఠి కలెక్టర్‌గా వచ్చిన సరిగ్గా 14 నెలల్లోనే ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది.
News December 31, 2025
NLG: ఈ ఉద్యోగానికి సాఫ్ట్‌వేర్ కంటే ఎక్కువే జీతం

జర్మనీ దేశంలోని పేరొందిన ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. 22 నుంచి 38 ఏళ్ల వయసు, బీఎస్సీ నర్సింగ్, GNM, ఒకటి, రెండేళ్లు క్లినిక్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి జర్మన్ భాషలో శిక్షణ అనంతరం నియామకాలు జరుగుతాయన్నారు. నెలకు సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి గలవారు కార్యాలయంలో సంప్రదించాలి.


