News November 6, 2025
యుగయుగాలకు ఆదర్శం ‘శ్రీరాముడి పాలన’

సత్య యుగంలో అంతా మంచే ఉన్నా, త్రేతా యుగంలోని రామ రాజ్యమే చరిత్రలో నిలిచింది. దీనికి కారణం శ్రీరాముని గొప్ప గుణాలు, ఆదర్శవంతమైన పాలన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చూపిన రాజధర్మం సుపరిపాలనకు చిరునామాగా నిలిచింది. ఒక గొప్ప వ్యక్తి రాజుగా ఉంటే, రాజ్యం ఎంతటి ఉన్నత శిఖరాలను చేరుతుందో రామరాజ్యం రుజువు చేసింది. అందుకే, యుగాల తరబడి ఆ పాలనను ఆదర్శంగా చెప్పుకుంటారు. ‘రామరాజ్యం’ అని పోల్చుతుంటారు.
Similar News
News November 6, 2025
MOILలో 99 ఉద్యోగాలు

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<
News November 6, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
News November 6, 2025
బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

బిహార్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


