News July 8, 2025

యుద్ధప్రాతిపదికన సీసీఆర్సీ పంపిణీ జరగాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో యుద్ధప్రాతిపదికన సీసీఆర్ కార్డులు పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల గుర్తింపు కార్డులు పంపిణీ, బిందు సేద్యం, సేంద్రియ వ్యవసాయం, గొర్రెలు, చేపల పెంపకంపై రైతులు, పోషకులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ విధులపై నిర్లక్ష్యం వహించవద్దన్నారు.

Similar News

News July 8, 2025

పెద్దపల్లి ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న వైద్య బృందాన్ని కలెక్టర్ అభినందించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో మెడ నొప్పికి చికిత్స పొందినా తగ్గలేదని ఓ మహిళ, కడుపు నొప్పితో బాధపడుతూ మరో మహిళ PDPL ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు శ్రీధర్, స్రవంతి, సౌరయ్య తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించి మంగళవారం ఇద్దరికి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. జిల్లా ప్రజలు DCH/PHCలను వినియోగించుకోవాలన్నారు.

News July 8, 2025

NRPT: ‘క్షయ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

image

క్షయ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో క్షయ వ్యాధి నివారణకు తీసుకున్న చర్యలను వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ తిరిగి లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయించాలని చెప్పారు.

News July 8, 2025

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

బాపట్ల జిల్లాలో వైరల్ ఫీవర్‌ కేసులు నమోదైతే ఆయా పరిసర ప్రాంతాల్లో అత్యవసరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ జె వెంకట మురళి మంగళవారం ఆదేశించారు. సాధారణం కంటే జ్వరాల కేసులు ఏ ప్రాంతంలోనైనా అధికమైతే వెంటనే సమాచారం పంపాలన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన ఔషధాలను నిల్వ చేసుకోవాలన్నారు. ప్రజలు పరిశుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు.