News December 31, 2025
‘యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి’

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, జులై 2026 నాటికి ఆర్.ఓ.బీ పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మార్చి 2026 నాటికి అండర్ పాస్ నిర్మాణ పనులను రైల్వే శాఖ పూర్తి చేయాలన్నారు. మార్చి 2026 నాటికి అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తవ్వాలన్నారు.
Similar News
News January 9, 2026
వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించడమే ప్రధాన లక్ష్యం: కలెక్టర్

జిల్లాలో బానిస కూలీల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించడమే అధికారుల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల కార్మిక రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలన్నారు. చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 9, 2026
ఖమ్మం జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో యాసంగి సాగు అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 10,942 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని, ఇప్పటి వరకు రైతులకు 36,314 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వెల్లడించారు. రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
News January 9, 2026
ఫిబ్రవరి 9 వరకే ఏపీ సెట్ దరఖాస్తుకు గడువు

రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ బ్రోచర్‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ శుక్రవారం ఆవిష్కరించారు. మెత్తం 30 సబ్జెక్టులకు మార్చి 28, 29 తేదీలలో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రూ.2 వేలు అపరాధ రుసుముతో ఫిబ్రవరి 25 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మార్చి 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.


