News February 6, 2026
యుద్ధ భయాలు: ఇరాన్‌ను వీడాలని తమ పౌరులకు US హెచ్చరిక

ఇరాన్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని US వర్చువల్ ఎంబసీ ఆదేశించింది. భూమార్గంలో పొరుగున ఉన్న అర్మేనియా, టర్కీకైనా వెళ్లాలని సూచించింది. కుదరకపోతే సరిపడా ఫుడ్, వాటర్‌తో అక్కడే సేఫ్ ప్లేస్‌లో తలదాచుకోవాలని తెలిపింది. ఇంటర్నెట్‌లో అంతరాయం ఉండొచ్చని, లోకల్ న్యూస్ ఛానల్స్ ఫాలో అవ్వాలని సూచించింది. అణుఒప్పందం కుదరని పక్షంలో ఏమైనా జరగొచ్చని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
Similar News
News February 21, 2026
మదనపల్లె మృగాడు మృతి.. CM ఏమన్నారంటే?

AP: మదనపల్లె హత్యాచార నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై CM చంద్రబాబు వినుకొండ సభలో స్పందించారు. ‘మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికొస్తే అది వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించా. చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్న భయంతో అతను ప్రాణాలు తీసుకున్నాడు’ అని చెప్పారు. ఘటన అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబీకులు ముందుకు రాని విషయం తెలిసిందే.
News February 21, 2026
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 21, 2026
అభిషేక్ ఫామ్‌పై కెప్టెన్ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

T20WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ అభిషేక్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కెప్టెన్ సూర్య స్పందించారు. అభి గురించి ఆందోళన పడుతున్నవారి గురించి తాను ఆందోళన పడుతున్నట్లు చమత్కరించారు. అతడిని ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి జట్లపై మరింత ఆందోళనగా ఉందన్నారు. అభి బ్యాట్‌తో ఏం చేస్తాడో గతేడాది చూశామని, ప్రస్తుతం మద్దతుగా నిలవాల్సిన టైమ్ అని చెప్పారు. దీంతో రేపటి మ్యాచ్‌లో అభిషేక్ ఆడటం కన్ఫర్మ్ అయినట్లే.


