News February 18, 2025
యునెస్కో అంతర్జాతీయ సదస్సుకు పెద్దపల్లి బిడ్డ

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమెర గ్రామానికి చెందిన డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సిల్వర్ జూబ్లీ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానం అందుకున్నారు. ఈ సదస్సులో యునెస్కో, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సహా 400 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
Similar News
News February 27, 2026
ఉగాది నాడు మూసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన?

TG: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఉగాది రోజున శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిదశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.5,000Cr అవసరమని అంచనా వేస్తున్నారు. రూ.4,100Cr ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అందించనుండగా మిగతాది ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. లంగర్‌హౌస్ బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మిస్తారు.
News February 27, 2026
విశాఖ: సైబర్ నేరాలకు అడ్డాగా మ్యూల్ ఖాతాలు

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఏజెంట్లు కమీషన్ ఆశ చూపించి వారి పేర్లపై మ్యూల్ ఖాతాలు తెరిపిస్తున్నారు. ఈ ఖాతాల ద్వారానే సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి విదేశాలకు తరలిస్తున్నారు. బాధితులు ఆలస్యంగా ఫిర్యాదు చేస్తే నిధుల రికవరీ కష్టమవుతోంది. మ్యూల్ ఖాతాలు సరఫరా చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో 400 మంది అకౌంట్‌దారులను అరెస్టు చేశారు.
News February 27, 2026
లైఫ్ సైకిల్ ఫండ్స్ వచ్చేశాయ్.. గోల్‌ని బట్టి డబ్బులు అడ్జస్ట్!

పిల్లల చదువులు లేదా రిటైర్మెంట్ కోసం పడే తిప్పలు తప్పించేలా సెబీ ‘లైఫ్ సైకిల్ ఫండ్స్’ తెచ్చింది. ఇందులో ఎంత కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో చెబితే చాలు. మొదట్లో లాభాల కోసం షేర్ మార్కెట్‌లో ఎక్కువ పెట్టి, లక్ష్యం దగ్గర పడేకొద్దీ దాన్ని సేఫ్ డిపాజిట్లలోకి ఫండ్ మేనేజరే మార్చేస్తారు. పాతకాలపు రిటైర్మెంట్ ఫండ్స్ ప్లేస్‌లో ఇవి వస్తున్నాయి. ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలనే టెన్షన్ ఉండదిక.


