News April 15, 2025
యువకుడిని కాపాడిన తిరుమల పోలీసులు

తిరుమలలో ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడిని పోలీసులు కాపాడారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నానికి చెందిన మునిసాత్విక్ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తిరుమలలోని కళ్యాణి చౌల్ట్రీలో 3 అంతస్తుల మిద్దెపై నుంచి దూకేస్తున్నట్లు హైదరాబాద్‌లోని చెల్లికి చెప్పాడు. వెంటనే సాత్విక్ చెల్లి తిరుమల పోలీసులకు చెప్పడంతో 10 నిమిషాల్లోనే వారు అక్కడికి వెళ్లి యువకుడిని కాపాడారు.
Similar News
News December 14, 2025
హిందూ ధర్మంలో ‘108’ విశిష్టత

మనం 108ని పవిత్రమైన సంఖ్యగా భావించడానికి అనేక కారణాలున్నాయి. మన హిందూ ధర్మంలో ఈ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవతలకు నామాలు, శివుడికి అనుచరులు, కృష్ణుడి బృందావనంలో పూల సంఖ్య నూట ఎనిమిదే. ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యచంద్రుల వ్యాసానికి 108 రెట్లు వాటికి భూమికి మధ్య దూరం ఉంటుంది. మనవ శరీరంలో కూడా మనం దృష్టి సారించాల్సిన చక్రాలు 108 ఉంటాయి. జపమాలలోనూ ఇన్నే పూసలుంటాయి.
News December 14, 2025
CSIR-CECRIలో ఉద్యోగాలు

చెన్నైలోని CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CECRI)12 పోస్టులను భర్తీ చేయనుంది. Sr.ప్రాజెక్ట్ అసోసియేట్, Sr.రీసెర్చ్ ఫెల్లో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు DEC 24న ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BE, బీటెక్, ME, ఎంటెక్ , MSc(కెమిస్ట్రీ), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cecri.res.in/
News December 14, 2025
సిద్దిపేట: దరఖాస్తుల ఆహ్వానం

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ఆదర్శ పాఠశాలలో అతిథి ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.నర్సింహులు తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పాఠశాలలో TGT మ్యాథ్స్, PGT మ్యాథ్స్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


