News March 20, 2025

యువకుడి ప్రాణం తీసిన బెట్టింగ్

image

బెట్టింగ్ ఊబిలో పడి అప్పు మీద అప్పు చేసి, తీర్చేందుకు స్తోమత లేక.. చివరికి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొలిమిగుండ్ల మండలం గోర్విమానుపల్లెకు చెందిన మహేంద్ర(28) గుత్తి రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మహేంద్ర గతంలో వాలంటీర్‌గా పనిచేసి, ప్రస్తుతం పెన్నా సిమెంట్‌లో పనిచేస్తున్నాడు.

Similar News

News March 20, 2025

జగిత్యాల: పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈఓ

image

జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసినట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 67 పరీక్ష కేంద్రాల్లో 11,855 మంది రెగ్యులర్ విద్యార్థులు, 285 మంది బ్యాక్లాగ్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన అన్నారు. 826 ఇన్విజిలేటర్ల ఆధ్వర్యంలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

News March 20, 2025

రేపటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా 2,650 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉ.9.30 నుంచి మ.12.30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌‌లు తీసుకెళ్లకూడదు.
* ALL THE BEST

News March 20, 2025

బాలం రాయి హై స్కూల్‌ను సందర్శించిన మంత్రి, కలెక్టర్

image

విద్యారంగం ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని HYD ఇన్‌‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ నల్లగుట్ట బాలంరాయి హైస్కూల్​లో ఎఫ్ఎల్ఎన్, ఏఎక్సెల్ ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను కలెక్టర్‌తో కలసి పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి, DEO ఉన్నారు.

error: Content is protected !!