News September 25, 2024

యువతకు ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో డిమాండ్‌కు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో యువతకు స్కిల్ డెవలప్ మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి కల్పనతో పాటు కులవృత్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Similar News

News September 30, 2024

ముస్తాబాద్‌: బస్సు కింద పడి చిన్నారి మృతి

image

ముస్తాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. సాల్కం మనోజ్ఞ(4) మండల కేంద్రంలోని మహర్షి పబ్లిక్ స్కూల్లో చదువుతోంది. స్కూల్ బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు టైర్ల కింద పడింది. దీంతో చిన్నారి తలకు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News September 30, 2024

కరీంనగర్ చేరుకున్న మంత్రి సీతక్క

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ మహాత్మనగర్‌లో మిషన్ భగీరథ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ పమేలా సత్పతి, మిషన్ భగీరథ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి సీతక్క కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

News September 30, 2024

నేడు కరీంనగర్ జిల్లా పర్యటనకు మంత్రి సీతక్క

image

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటించనున్నారు. ఉ.10.30 మానకొండూరు అంగన్వాడీ కేంద్రంలో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మిషన్ భగీరథ గెస్ట్ హౌస్ ఎల్ఎండీ కాలనీలో కరీంనగర్ కలెక్టర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీతక్క ,పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.