News January 4, 2025

యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్

image

తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. మాదాపూర్‌లో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగంలో సుమారు 1,800 మందికి ఉపాధి కల్పిస్తున్న సెంటిలియన్ నెట్ వర్క్స్ అండ్ హెచ్‌సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు.

Similar News

News November 8, 2025

గ్యారెంటీలకు జూబ్లీహిల్స్‌లో BRS గెలవాలి: హరీశ్‌రావు

image

సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ నాయకులకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజలకు, బస్తీ వాసులకు అండగా నిలిచారని అన్నారు. షేక్‌పేట్‌లోని అంబేడ్కర్ నగర్‌ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

News November 8, 2025

HYD: ‘బస్తర్ హననంపై మీడియా మౌనం ఎందుకు’

image

దేశంలో దారుణమైన ఘటనలు జరిగినప్పుడు పలు కథనాలను ప్రచురించే మీడియా బస్తర్‌లో జరుగుతున్న హననంపై మౌనం ఎందుకు వహిస్తుందో గమనించాలని మాజీ సంపాదకులు కే.శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. SVKలో పౌర హక్కుల సంఘం తెలంగాణ 3వ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని మీడియా సంస్థలను కంట్రోల్ చేసే వ్యవస్థ ఢిల్లీలో ఉందని, అందుకే మీడియా సంస్థలు మౌనం వహిస్తున్నాయని అన్నారు. రఘునాథ్, ప్రొ.హరగోపాల్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

News November 8, 2025

ఖైరతాబాద్: సాగర తీరంలో సీఎం సైకత చిత్రం

image

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో శాండ్‌ ఆర్ట్‌తో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్‌ తీర్చిదిద్దారు. నెల్లూరు నుంచి తెప్పించిన 40 టన్నుల ఇసుకను ఉపయోగించి రేవంత్‌ చిత్రాన్ని 24 గంటలపాటు శ్రమించి రూపొందించారు. ఈ నెల 15వరకు ఈ ఆర్ట్‌ ఉంటుంది.