News February 22, 2025
యువతను శక్తివంతంగా మార్చడమే లక్ష్యం: శ్రీధర్ బాబు

టాస్క్ & శ్రీ సత్యసాయి సేవా సంస్థతో కలిసి ఉచిత డేటా ఇంజినీరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు. డిమాండ్‌లో ఉన్న టెక్ నైపుణ్యాలు,ఉద్యోగ అవకాశాలతో తెలంగాణ యువతను శక్తివంతంగా మార్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 22, 2025
IML T20: నిరాశపర్చిన సచిన్.. స్కోర్ ఎంతంటే?

ముంబైలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20-2025లో సచిన్ టెండూల్కర్ నిరాశ పరిచారు. శ్రీలంక మాస్టర్స్ జట్టుపై 8 బంతుల్లో 10 రన్స్ చేసి ఔటయ్యారు. అంబటి రాయుడు 5, గుర్‌కీరత్ సింగ్ మాన్ 44, స్టువర్ట్ బిన్నీ 68, యువరాజ్ 31*, యూసఫ్ పఠాన్ 56* రన్స్ చేశారు. ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో 222/4 రన్స్ చేసింది.
News February 22, 2025
బంతులా?.. బుల్లెట్లా?

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ CTలో భాగంగా ఇవాళ ఆసీస్‌పై బంతులతో నిప్పులు చెరిగారు. తొలి నాలుగు ఓవర్లలో కేవలం రెండు బంతులే 150Kmph కంటే తక్కువ వేగంతో వేశారు. మిగతా బాల్స్ అన్నీ 150Kmph కంటే వేగంగా సంధించాడు. ఇందులో వేగవంతమైన బంతి స్పీడ్ 153.5Kmph. ఇంతటి వేగంలోనూ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో బాల్స్ వేయడంతో ఆసీస్ బ్యాటర్లు స్కోర్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే వుడ్ ఓ వికెట్ తీశారు.
News February 22, 2025
MLC ఎన్నికల్లో విజయం బీజేపీదే: బండి సంజయ్

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం నిర్వహించారు. కమిట్‌మెంట్‌తో పని చేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా టీచర్ల సమస్యలపై మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు.