News April 1, 2025

‘యువతిని చంపి 100 కి.మీలు బైక్‌పై తీసుకొచ్చారు’

image

సాలూరులో<<15956280>> యువతి హత్య<<>> కేసును పోలీసులు చేధించిన విషయం తెలిసిందే. యువతి మెడపై 2 గాయాలు ఉండడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. రాంబాబు ఐశ్యర్యను విశాఖ జిల్లా ఆరిలోవలోని ఓ రూములో చంపినట్లు తేలింది. అక్కడి నుంచి స్నేహితుల సాయంతో సాయంతో డెడ్‌బాడీని బైక్‌పై 100 KM తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీశాడు. బైక్‌పై వచ్చినప్పుడు రికార్డ్ అయిన CC ఫుటీజీ ఆధారంగా రాంబాబును అరెస్ట్ చేశారు.

Similar News

News April 2, 2025

కర్ణాటకలో ఓలా, ఉబెర్, ర్యాపిడో బైక్స్‌పై నిషేధం

image

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది. మోటార్ వాహనాల చట్టం(1988)లోని సెక్షన్-93ని అనుసరించి ప్రభుత్వం నిబంధనల్ని ఏర్పాటు చేసేవరకూ ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీలు తిరగడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తమను రవాణా సేవల సంస్థలుగా పరిగణించి లైసెన్సులివ్వాలని ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.

News April 2, 2025

RBI డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా

image

దశాబ్దకాలం తర్వాత RBI డిప్యూటీ గవర్నర్‌గా మహిళ నియమితులయ్యారు. ప్రముఖ ఎకానమిస్ట్ పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో 20 ఏళ్లపాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆమె సొంతం. భారత ప్రభుత్వ అడ్వైజర్‌గా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్(NCAER) డైరెక్టర్‌గానూ సేవలందించారు. RBI మానిటరీ పాలసీ కమిటీలో పూనమ్ చేరనున్నట్లు తెలుస్తోంది.

News April 2, 2025

నారాయణపేటలో నేషనల్ EMT DAY వేడుకలు

image

108లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నందుకుగాను ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండో తేదీన నేషనల్ EMT DAY వేడుకలు ఘనంగా నిర్వహిస్తోందని MBNR జిల్లా ప్రోగ్రాం అధికారి రవికుమార్, NRPT జిల్లా సూపర్‌వైజర్ రాఘవేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!