News March 18, 2024

యువతిని నమ్మించి మోసం.. యువకుడికి జైలు శిక్ష

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో యువకుడికి జైలు శిక్షతో పాటు ఫైన్ విధిస్తూ ఏలూరు 5వ అదనపు జిల్లా కోర్టు కమ్ మహిళా కోర్టు జడ్జి జి.రాజేశ్వరి తీర్పునిచ్చారు. వారి వివరాల ప్రకారం.. 2019లో నరేష్ అనే యువకుడు పాలకొల్లుకు చెందిన యువతని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం నిరూపితం కావడంతో నరేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.2వేల ఫైన్ విధించారు.

Similar News

News July 8, 2024

ప.గో జిల్లాలో జోరుగా వ్యవసాయ పనులు

image

ప.గో జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు అన్నారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, గణపవరం మండలాల్లో 21,983 ఎకరాల్లో ఇప్పటికే నాట్లు పడ్డాయన్నారు. ఈ నెలాఖరుకు అత్యధిక విస్తీర్ణంలో నాట్లు పూర్తవుతాయని, పల్లపు ప్రాంతాల్లో నారు సంరక్షణకు రైతులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.

News July 8, 2024

ఏలూరు: UPDATE.. మృతులు HYDవాసులు

image

ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి పరిధిలోని రాజవోలు వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. కారు డ్రైవర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లికి చెందిన దుర్గా వంశీగా గుర్తించారు.

News July 8, 2024

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్, బాలుడికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా లక్ష్మీనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.