News February 1, 2025

యువతిని మోసం చేసిన వరంగల్ యువకుడు

image

వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన సాయితేజ(26) ప్రేమ పేరుతో ఓ యువతిని(21) మోసం చేశారు. HYD SRనగర్ పోలీసుల ప్రకారం.. సనత్‌నరగ్‌కు చెందిన యువతి బేగంపేటలో పనిచేస్తోంది. సాయితేజ ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. చివరికి వేరే అమ్మాయిని చేసుకుంటానని బాధితురాలికి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News February 1, 2025

MBNR: తమ్ముడిని దించొద్దామని వెళ్లి.. చనిపోయాడు

image

MBNR జిల్లా మన్యంకొండ సమీపంలో నిన్న జరిగిన <<15324831>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మండలంలోని పోతన్‌పల్లికి చెందిన ఆంజనేయులు(21) తమ్ముడు కేశవులు(19) గుంటూర్‌లో చదువుకుంటున్నాడు. సెలవులపై వచ్చిన కేశవులును గుంటూర్‌కు పంపేందుకు శుక్రవారం తెల్లవారుజామున బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంజనేయులు మృతి చెందాడు. కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

News February 1, 2025

దారుణం.. తల్లి మృతదేహంతో తొమ్మిది రోజులు!

image

TG: తల్లి మృతదేహం పక్కనే డిప్రెషన్‌తో ఇద్దరు కూతుళ్లు 9రోజులు గడిపారు. HYDలోని బౌద్ధనగర్‌కు చెందిన రాజు, లలిత(45)కు రవళిక, అశ్విత ఇద్దరు కుమార్తెలు. 4ఏళ్ల క్రితం వీరిని వదిలేసి రాజు ఎక్కడికో వెళ్లాడు. ఈ క్రమంలో లలిత గుండెపోటుతో మరణించారు. అంతిమ సంస్కారాలకు డబ్బులు లేక కూతుళ్లు కూడా చనిపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో నిన్న బాహ్య ప్రపంచానికి తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News February 1, 2025

నందికొట్కూరులో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మృతి

image

నందికొట్కూరుకు చెందిన రిటైర్డ్ టీచర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఇందిరాబాయి (90) శనివారం ఉదయం మరణించారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1993లో ఆమె ఉత్తమ ఉపాధ్యాయులిగా రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు.