News December 25, 2024
యువతిని మోసం చేసిన వ్యక్తికి రిమాండ్: సీఐ
ఎస్.కోట మండలం రాజీపేటకి చెందిన వాడుబోయిన ఎర్రినాయుడు (19) పై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసగించాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేశామని సీఐ మూర్తి తెలిపారు. అతడిని కాపు సోంపురం వద్ద మంగళవారం అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం విజయనగరం డీఎస్పీ వద్దకు తీసుకెళ్ళగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
Similar News
News December 25, 2024
విజయనగరంలో వర్షాలపై వాతావరణ శాఖ UPDATE
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో బలహీన పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంతో పాటు నెల్లూరు జిల్లాలకు మరో 24 గంటల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
News December 25, 2024
VZM: ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు
యేసు క్రీస్తు జననం సందర్భంగా జిల్లాలో నిర్వహించే క్రిస్టమస్ వేడుకల్లో ఎటువంటి అల్లర్లు, మతపరమైన తగాదాలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా చర్చిల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎటువంటి అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లను సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారన్నారు.
News December 25, 2024
విశాఖ R.K బీచ్‌లో నేవీ విన్యాసాలకు సన్నద్ధం..!
ఆకాశమే హద్దుగా సంద్రంలో నావికాదళం చేసే యాక్షన్-ప్యాక్డ్ క్షణాలను తిలకించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని నేవీ అధికారులు పిలుపునిచ్చారు. విశాఖ ఆర్కే బీచ్‌లో జనవరి 4న(2025) సాయంత్రం 4 గంటలకు మెరైన్ కమాండోలు, NCC క్యాడెట్లు, నావల్ బ్యాండ్ అద్భుతమైన విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ఈనెల 28,29, జనవరి 2న రిహార్సల్స్ చేయనున్నట్లు వెల్లడించారు. >Share it