News March 22, 2025
యువతిపై దాడి కేసులో ఇద్దరికి రిమాండ్

HNRలో యువతిపై దాడి చేసి శారీరకంగా కలవాలని బెదిరించి గాయపరిచిన ఘటనలో గురువారం ఇద్దరు యువకులతో పాటు, ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఇద్దరిని రిమాండ్‌కు తరలించగా, మరొకరు పరారీలో ఉన్నట్లు హుజుర్‌నగర్ సీఐ చరమంద రాజు, ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.
Similar News
News September 14, 2025
బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత!

ఎమ్మెల్సీ పోతుల సునీత ఆదివారం BJPలో చేరారు. విశాఖలో జరుగుతున్న సారథ్యం సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీకి దూరంగా ఉన్న పోతుల సునీత BJPలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
News September 14, 2025
మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో డీకే అరుణ

తిరుపతి వేదకగా ఆదివారం ప్రారంభమైన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పార్లమెంట్ పరిధిలో మహిళా సాధికారత, 10 అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత, మహిళ 7 ఆత్మగౌరవాన్ని పెంచే దిశలో తీసుకోవాల్సిన చర్యలు, ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై కీలకంగా చర్చించడం జరుగుతుందన్నారు.
News September 14, 2025
జనగామ: రైలులో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

జనగామ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ వైపు వెళ్లే ఎగువ లైన్‌లో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతదేహాన్ని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి చాతి పై గౌరీ అనే పచ్చబొట్టు ఉందని, మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే 9247800433 రైల్వే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.