News December 7, 2025

యువతిపై లైంగిక వేధింపులు.. పోలీసులు కేసు తీసుకోలేదా..?

image

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యువతికి సంబంధించిన వివాదంపై పలు ప్రచారాలు సాగుతున్నాయి. యువతి తరఫున ముగ్గురు గత నెల 24, 25న స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా తీసుకోలేదని సమాచారం. దీంతో యువతి మరోదారి లేక టీసీ తీసుకుని వెళ్లిపోయిందన్న చర్చ జోరుగా నడుస్తోంది.

Similar News

News December 7, 2025

‘విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తా’

image

విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ నారాయణస్వామి పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం జిల్లాలో పటష్ఠంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

News December 7, 2025

ఇండిగోకి DGCA షోకాజ్ నోటీసులు

image

ఇండిగో సర్వీసుల్లో ఏర్పడిన గందరగోళంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ CEO పీటర్ ఎల్బర్స్‌, మేనేజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. లార్జ్ స్కేల్ క్యాన్సిలేషన్స్, ప్లానింగ్‌లో వైఫల్యం, నిర్లక్ష్యం వంటి అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది. ఈ విషయంలో ఇండిగో సంస్థపై కఠిన చర్యలు ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

News December 7, 2025

ఫ్యూచర్ సిటీ విజన్.. ఆర్థిక లక్ష్యాలు ఇవే!

image

*రాష్ట్ర సుదీర్ఘకాల ఆర్థిక ప్రణాళికనే ఫ్యూచర్ సిటీ
*విజన్-2047 ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం
*దేశంలో మొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ
*FCDA ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలు
ఇన్నోవేషన్, పారిశ్రామిక హబ్‌లు BFCలో కీలకం. AI, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఫిన్‌టెక్, ఎలక్ట్రానిక్స్ తయారీతో పాటు వేలాది మంది ఉపాధి. 30K ఎకరాలను నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద, Green జోన్‌లుగా విభజించారు.