News February 1, 2025

యువతీ యువకులకు ఉచిత శిక్షణ  

image

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పుర్ గ్రామంలోని స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వహకులు తెలిపారు. బేసిక్ కంప్యూటర్స్, సోలార్ సిస్టం ఇన్‌స్టాలేషన్, సర్వీస్, కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, ఎలక్ట్రీషియన్‌పై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తుచేసుకోవాలన్నారు.

Similar News

News November 5, 2025

గ్రేటర్ వరంగల్ వరద ముప్పు నివారణకు సమగ్ర ప్రణాళికలు

image

గ్రేటర్ వరంగల్‌ను వరద ముంపు ముప్పు నుంచి శాశ్వతంగా రక్షించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో జరిగిన సమీక్షలో నాలాలు, డ్రైన్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, రిటైనింగ్ వాల్స్ నిర్మాణంపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిపుణుల సలహాలతో పటిష్ఠ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

News November 5, 2025

ఖమ్మం: నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోండి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం వారి DEET APPను ఫోన్లో డౌన్ లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. రిఫరల్ కోడ్:JSBCM అని టైప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ APPలో దాదాపు 900 కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడానికి రిజిస్టర్ చేసుకున్నాయని అన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 5, 2025

NZB: కార్తీకపౌర్ణమి.. ఫేమస్ శివాలయాలు ఇవే!

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. NZB కంఠేశ్వరాలయం, BDN చక్రేశ్వరాలయం పురాతన ఆలయాలు. ఆర్మూర్‌లో నవనాథ సిద్ధేశ్వారలయం జిల్లాకు ఈశాన్య దిశలో ఉంది. కామారెడ్డి(D) తాండూర్‌లో త్రిలింగ రామేశ్వరాలయంలో లింగాన్ని రామచంద్రుడు ప్రతిష్ఠించాడని నమ్మకం. మద్దికుంటలో బుగ్గ రామలింగేశ్వరాలయం, బండారామేశ్వర్‌పల్లెలో రాజారాజేశ్వరాలయం, బిక్కనూర్ సిద్ధి రామేశ్వరాలయం ప్రసిద్ధి చెందినవి