News February 24, 2026

యువత రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్

image

ఏపీ శాసనసభను మంగళవారం 510 మంది విద్యార్థులు సందర్శించారు. పది రోజుల విజ్ఞాన యాత్రలో భాగంగా 93 పాఠశాలల నుంచి 3,311 మంది అసెంబ్లీని వీక్షించారు. సభా విరామంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విద్యార్థులతో ముచ్చటించి సందేహాలను నివృత్తి చేశారు. త్వరలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. యువత ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

Similar News

News February 26, 2026

మోదీ ఇజ్రాయెల్ పర్యటన తర్వాత ఇరాన్‌పై అమెరికా దాడి: ఒవైసీ

image

మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గాజా మారణహోమానికి నెతన్యాహునే కారణమని ఆరోపించారు. ఆయన్ని ‘యుద్ధ నేరస్థుడి’గా అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని మోదీ కౌగిలించుకోవడమేంటి అని ప్రశ్నించారు. ఇది పాలస్తీనాకు భారత్ అందించే చిరకాల మద్దతును దెబ్బతీయడమేనని విమర్శించారు.

News February 26, 2026

ASF: విద్యుత్ ఫిర్యాదులు వాట్సాప్‌లోనే

image

ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారుల సౌకర్యం కోసం వాట్సాప్ చాట్ బాట్ ప్రారంభించిందని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఉత్తమ్ జాడే తెలిపారు. 7901628348కు వాట్స్ఆప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే ఫిర్యాదు నమోదు అవుతుంది. ట్రాక్, ఏజెంట్‌తో చాట్ చేయవచ్చు. సర్వీస్ నంబర్‌తో ఫిర్యాదు ID వెంటనే వస్తుంది. పరిష్కారం తర్వాత SMS/IVRS ద్వారా సమాచారం అందుతుందన్నారు.

News February 26, 2026

కట్టకొక కంకి లేతైనా పుట్టికి ఏదుంతరుగు

image

పంట పండే సమయంలో ప్రతి మొక్కకు (కట్టకు) ఉండే కంకి గట్టిపడకుండా, పాలు పోసుకునే దశలో లేదా లేతగా ఉంటే, గింజ బరువు తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పంటను అమ్మితే ఆశించిన బరువు రాకపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. అంటే పంట కేవలం సంఖ్యలో (కంకులు) ఎక్కువగా ఉంటే సరిపోదు, గింజ ముదిరి గట్టిగా ఉంటేనే రైతుకు సరైన బరువు, తద్వారా లాభం వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.