News January 30, 2026
యువరాజ్ ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటో చూశారా?

సినీ గ్లామర్‌ను వదిలేసి అచ్చమైన భారతీయ ఇల్లాలుగా మారిపోయిన హేజల్ కీచ్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి స్టార్ మోడల్, యువరాజ్ సింగ్ భార్య ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. మోడలింగ్, మేకప్ పక్కన పెట్టి.. పిల్లల సంరక్షణలో ఆమె మునిగిపోయారు. గ్లామర్ కంటే కుటుంబంతో ఉండే సింప్లిసిటీలోనే అసలైన అందం, ఆనందం ఉందని హేజల్ నిరూపిస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.
Similar News
News February 6, 2026
పల్నాడు: కొండవీడు ఉత్సవాల షెడ్యూల్ విడుదల!

జిల్లాలోని చారిత్రక కొండవీడు కోట ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. 2026 ఫిబ్రవరి 7, 8 తేదీల్లో వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాల షెడ్యూల్‌ను కలెక్టర్ కార్యాలయం విడుదల చేసింది. కలెక్టర్ కృత్తికా శుక్ల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలందరూ ఈ వేడుకలకు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
News February 6, 2026
సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎంకే మీనా?

AP: సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా నియమితులు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన గనులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు. కాగా ఇప్పటివరకు CM ముఖ్యకార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు TTD EOగా అదనపు బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న TTD EO సింఘాల్‌ను బదిలీ చేశారు.
News February 6, 2026
30వారాల గర్భాన్ని తొలగించేందుకు సుప్రీం అనుమతి!

బాయ్ ఫ్రెండ్ వల్ల 17ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన ఓ అమ్మాయి 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు సదరు యువతికే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇష్టం లేని గర్భాన్ని దాల్చాలని ఏ స్త్రీని బలవంతం చేయలేమని జడ్జీలు పేర్కొన్నారు. బాధితురాలి మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని వెంటనే అబార్షన్ చేయాలని కోర్టు ఆదేశించింది.


