News December 19, 2025

యూట్యూబర్‌పై ED దాడులు.. లగ్జరీ కార్లు సీజ్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేసిన కేసులో UPలోని ఉన్నావో జిల్లాకు చెందిన యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంటిపై ED దాడులు చేసింది. లంబోర్గిని URUS, BMW Z4, బెంజ్ సహా పలు లగ్జరీ వెహికల్స్‌ను అధికారులు సీజ్ చేశారు. స్కై ఎక్స్‌ఛేంజ్ సహా పలు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో ద్వివేదికి భారీగా ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది. అనురాగ్‌ యూట్యూబ్ ఛానల్‌కు 7.11 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Similar News

News December 19, 2025

రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం!

image

ప్రతిపక్షాల నిరసనల నడుమ రాజ్యసభలో VB-G RAM G బిల్లు ఆమోదం పొందింది. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలనే డిమాండ్‌తో ప్రతిపక్ష MPలు వాకౌట్ చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను కాంగ్రెస్ అగౌరపరుస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఈ చట్టాన్ని BJP వెనక్కి తీసుకొనే రోజు వస్తుందని మల్లికార్జున ఖర్గే చెప్పారు.

News December 19, 2025

జీవితఖైదు వేసే అధికారం సెషన్స్ కోర్టుకు లేదు: సుప్రీం కోర్టు

image

జీవితఖైదు శిక్ష విధించే అధికారం కేవలం రాజ్యాంగబద్ధ కోర్టులకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ విధించడం, కోర్టులు వేసిన శిక్ష తగ్గించే అధికారాలు సెషన్ కోర్టులకు లేవని జస్టిస్ అహ్సానుద్దిన్ అమానుల్లా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల బెంచ్ చెప్పింది. లైంగిక కోరిక తీర్చడానికి నిరాకరించడంతో మహిళకు నిప్పంటించి చంపేసిన కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది.

News December 19, 2025

విశాఖ రుషికొండ బిల్డింగ్‌పై జగన్ ఏమన్నారంటే?

image

AP: మెడికల్‌ కాలేజీల అంశంపై గవర్నర్‌ను కలిసిన అనంతరం YCP చీఫ్ జగన్ విశాఖ రుషికొండ నిర్మాణాలపై స్పందించారు. ‘మా హయాంలో రుషికొండపై రూ.230CRతో బ్రహ్మాండమైన బిల్డింగ్‌ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికమైంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు యోగా డే కోసం అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామగ్రి కొనుగోలులోనూ అవినీతికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు.