News December 29, 2025

యూట్యూబర్ అన్వేష్‌ను అరెస్ట్ చేయండి: VHP

image

AP: యూట్యూబర్ అన్వేష్‌పై (నా అన్వేషణ) కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హిందూ దేవతలు, భారత మహిళల వస్త్రధారణపై అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని VHP ప్రతినిధులు విశాఖ గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడిన అతడిని అరెస్ట్ చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలతో అన్వేష్ ఇన్‌స్టాలో లక్షకు పైగా ఫాలోవర్లను కోల్పోయారు.

Similar News

News January 9, 2026

తొక్కుడు బిళ్ల ఆడతారా?

image

AP: కనుమరుగవుతున్న సంప్రదాయ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కర్రా బిళ్ల, తొక్కుడు బిళ్ల, తాడాట, తాడు లాగుడు, ఏడు పెంకులాట, కర్రసాము, గాలిపటాలు ఎగిరేయడం లాంటి ఆటల పోటీలను నిర్వహించనుంది. శాప్ అధ్వర్యంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవి జరగనున్నాయి. అన్ని వయసుల వాళ్లూ పాల్గొనవచ్చు. విజేతలకు బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు.

News January 9, 2026

ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. టచ్ చేస్తే రియాక్షన్ గట్టిగా ఉంటుంది!

image

ఇరాన్ ప్రభుత్వానికి ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ జరుగుతున్న ఆందోళనల్లో నిరసనకారులను చంపితే ఊరుకోబోమని, తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ‘ఒకవేళ మీరు ప్రజలను చంపడం మొదలుపెడితే మేం మీపై బలంగా దాడి చేస్తాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఇరాన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. తొక్కిసలాట వల్ల కూడా కొందరు చనిపోయి ఉండొచ్చు. కానీ కావాలని హింసకు పాల్పడితే మాత్రం మూల్యం చెల్లించాల్సిందే’ అని ట్రంప్ అన్నారు.

News January 9, 2026

చెర్రీ‌స్‌తో ఎన్నో లాభాలు

image

చెర్రీస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చెర్రీస్ రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అలాగే నిద్రలేమి, బీపీ, గుండె జబ్బుల నుంచి చెర్రీస్‌ రక్షిస్తాయి. చెర్రీస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. తద్వారా చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.