News March 29, 2025
యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

HYD అంబర్‌పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా శంకర్‌ది భువనగిరి జిల్లా.
Similar News
News November 11, 2025
‘AI విద్యాబోధన ద్వారా విద్యార్థుల్లో మార్పునకు కృషి చేయాలి’

విద్యావిధానంలో ఏఐ విద్యాబోధన ద్వారా విద్యార్థులలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏఐ బోధన, విద్యార్థుల హాజరు శాతం పెంపుదల, నాణ్యమైన విద్యాబోధన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులు 100 శాతం హాజరయ్యేలా చూడాలన్నారు.
News November 11, 2025
తూ.గో జిల్లాలో 8,773 ఇళ్ల నిర్మాణం పూర్తి

తూ.గో జిల్లాలో 8,773 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారని హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్(PD) నాతి బుజ్జి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం గృహప్రవేశాలు చేస్తారని చెప్పారు. అన్ని నియోజక వర్గాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో గృహప్రవేశాలు వేడుకగా నిర్వహిస్తామన్నారు. గోకవరం మండలం కామరాజుపేటలో జరిగే కార్యక్రమానికి కలెక్టర్ హాజరవుతారన్నారు.
News November 11, 2025
MBNR: ‘అంగన్‌వాడీ పనితీరు మెరుగుపడాలి’

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీఓలు, సూపర్ వైజర్‌లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెంచాలని అన్నారు. గ్రామాల్లో కేంద్రాలకు ఎంత మంది హాజరవుతున్నారనే అంశంపై స్పష్టత ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు.


