News March 29, 2025

యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

HYD అంబర్‌పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా, శంకర్‌ది నల్గొండ జిల్లా.

Similar News

News April 1, 2025

NLG: 2న SC సంఘం ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

షెడ్యూల్డ్ కులాల సంఘ ప్రతినిధులతో ఏప్రిల్ 2న నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5న భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, 14న డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News April 1, 2025

NLG: దొడ్డు బియ్యం వేలానికి కసరత్తు!

image

రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 4,65,943 రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. కాగా ఎఫ్సీఐ, గోదాముల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే కంపెనీ చేయగా కొంతమేరకు డీలర్ల వద్ద కూడా దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వీటిని వేలం ద్వారా అమ్మకాలు చేయనున్నారు.

News April 1, 2025

నల్గొండ: రాజీవ్ యువ వికాసం గడువు పెంపు

image

రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు గానూ ఏప్రిల్ 14 వరకు మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో మ్యానువల్‌గా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

error: Content is protected !!