News March 29, 2025

యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

HYD అంబర్‌పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా, శంకర్‌ది నల్గొండ జిల్లా.

Similar News

News April 1, 2025

నా పిల్లలు ఇండియాలోనే పెరగాలి: అమెరికన్ తల్లి

image

తన పిల్లలు భారతదేశంలో పెరిగితేనే ప్రయోజకులు అవుతారని ఓ అమెరికన్ తల్లి SMలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ ఈ పోస్ట్ పెట్టారు. ‘సంపాదనపరంగా US బెస్ట్ ఏమో కానీ.. సంతోషం మాత్రం భారత్‌లోనే దొరుకుతుంది. ఇక్కడ నివసిస్తే భావోద్వేగాలను హ్యాండిల్ చేయొచ్చు. లోతైన సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. సర్దుకుపోవడం అలవాటు అవుతుంది. కృతజ్ఞతాభావం పెరుగుతుంది’ అంటూ పేర్కొన్నారు.

News April 1, 2025

అలంపురం పుణ్యక్షేత్రంలో రమణీయంగా రథోత్సవం

image

శ్రీశైలం మహా క్షేత్రానికి పశ్చిమ ద్వారమైన అలంపురం పుణ్యక్షేత్రంలో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం రాత్రి రథోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధల మధ్య రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి, అమ్మవారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను రథంలో కూర్చో బెట్టి ఆలయం చుట్టూ ఊరేగించారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ స్వామివారి విగ్రహాలను ఆలయ ప్రాకార మండపంలో రథం ఊరేగించారు.

News April 1, 2025

పొందుర్తిలో రైతు ఆత్మహత్య

image

రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన స్వామి రెండు ఎకరాల్లో పంట సాగు చేసినట్లు చెప్పారు. బోరులో నీటిమట్టం తగ్గిపోవడంతో చేతికొచ్చే పంట ఎండిపోవడాన్ని తట్టుకోలేక తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

error: Content is protected !!