News February 21, 2025
యూట్యూబర్ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

గుంతకల్లు మండలం బుగ్గ సంగాల గ్రామ సమీపంలో 2 రోజుల క్రితం యూట్యూబర్ తిరుమలరెడ్డి హత్య కేసులో ముగ్గురిని కసాపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. యూట్యూబర్ తిరుమలరెడ్డి హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ట్రాక్టర్, బైకు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసినట్లు తెలిపారు. భూ వివాదంతోనే హత్య చేసినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News February 22, 2025
శ్రీ సత్యసాయి: తెలుగు టీచర్ సస్పెండ్

తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో సూర్యనారాయణ రెడ్డి అరెస్టై అనంతపురం జిల్లా జైలులో ఉన్నారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతడిని సస్పెండ్ చేశామన్నారు.
News February 22, 2025
అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం

పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా సమీపంలో 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 22, 2025
అనంత: గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

అనంతపురం జిల్లాలో అదివారం జరగనున్న గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. నగరంలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించే SSBN, ఎస్.వి డిగ్రీ కళాశాలల్లో ఆయన శుక్రవారం తనిఖీలు చేశారు. అక్కడ అధికారులు చేసిన ఏర్పాట్లపై అరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.