News February 19, 2025
యూట్యూబర్ హత్య.. భూ వివాదమే కారణమా?

గుంతకల్లు మండలంలో యూట్యూబర్ తిరుమల్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఆయన కసాపురం హంద్రీనీవా కాలవలో మంగళవారం శవమై తేలారు. పోలీసుల వివరాల మేరకు.. భూ వివాదమే ఆయన హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. సంగాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో భూ వివాదం నడుస్తోందని, మృతుడి భార్య కూడా అతడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News September 15, 2025
KMR: నాటి ఇంజినీర్ల సృష్టి ఈ అద్భుతాలు!

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ కోట, లింగంపేట బావి, పోచారం ప్రాజెక్టులు ఆనాటి ఇంజినీర్ల నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. 103 ఏళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తన సామర్థ్యాన్ని మించి వరదను తట్టుకుని నిలబడింది. ఈ నిర్మాణాలు ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటూ నాటి ఇంజినీరింగ్ ప్రమాణాలను నిరూపిస్తున్నాయి. ఆనాటి ఇంజినీర్ల కృషికి ఈ కట్టడాలు నిలువెత్తు నిదర్శనం.
News September 15, 2025
అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి: ఓంబిర్లా

AP: మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత భారత్ సాధించలేమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. తిరుపతి మహిళా సాధికార సదస్సులో రెండోరోజు మాట్లాడారు. ‘భద్రత, ఆత్మనిర్భరత ప్రతి మహిళకు అందాలి. స్త్రీలను అన్నిరంగాల్లో మరింత ముందుకు తీసుకొచ్చేలా చర్చించాం. పంచాయతీ స్థాయిలో కంప్యూటర్ సెంటర్ ఉండేలా చూడాలి. అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనేది PM కల’ అని తెలిపారు.
News September 15, 2025
అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి టీకాలు : డీడీ

జిల్లాలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ డీడీ సోమయ్య తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పశు వ్యాధి నియంత్రణలో భాగంగా పశువులకు గాలి కుంటు టీకాల కార్యక్రమాన్ని ఏడీలు రామచంద్రరావు, చైతన్య కిషోర్‌లతో కలిసి ప్రారంభించారు. నాలుగు మాసాలు నిండిన పశువులకు ఈ టీకాలను తప్పనిసరిగా వేయించాలని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.