News December 19, 2025
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) 11 డొమైన్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. జీతం నెలకు రూ.60,000-రూ.70,000వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ugc.gov.in
Similar News
News December 20, 2025
అన్‌రిజర్వ్‌డ్ టికెట్ బుక్ చేశారా? ప్రింటవుట్ అవసరం లేదు!

మొబైల్ ద్వారా బుక్ చేసిన అన్‌రిజర్వ్‌డ్ డిజిటల్ టికెట్లకు ప్రింటవుట్ అక్కర్లేదని ఇండియన్ రైల్వేస్ వెల్లడించింది. ఏ మొబైల్ నుంచి అయితే బుక్ చేశారో చెకింగ్ టైంలో అదే ఫోన్‌లో చూపిస్తే సరిపోతుంది. ప్రింటవుట్ తప్పనిసరి అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో ఫిజికల్ టికెట్ తీసుకుంటే మాత్రం ప్రయాణమంతా దాన్ని వెంట ఉంచుకోవాల్సిందే.
News December 20, 2025
పెదవులు పగులుతున్నాయా? ఇది కూడా కారణం కావొచ్చు

శీతాకాలంలో చర్మం పొడిబారడం, పెదవులు పగలడం కామన్. అయితే వాతావరణం వల్ల మాత్రమే కాదు, శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. విటమిన్ బి12 లోపం వల్ల ఈ సమస్య ఎదురవుతుందంటున్నారు. దీనికోసం మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవాలని సూచిస్తున్నారు. శాకాహారులు పాలకూర, జున్ను, పాలు, తృణధాన్యాలు వంటివి ఆహారంలో చేర్చుకోవచ్చని చెబుతున్నారు.
News December 20, 2025
T20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన

వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది.
టీమ్: సూర్య (C), అక్షర్ పటేల్ (Vc), అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, రింకూ సింగ్, అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, సుందర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్.
– వన్డే, టెస్ట్ జట్ల కెప్టెన్ గిల్‌కు చోటు దక్కలేదు


