News September 23, 2024
యూపీ సీఎంను కలిసిన మేయర్, కార్పొరేటర్ల బృందం

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయే లక్ష్మి ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ల బృందం ఈరోజు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్‌లను ఆయనకు మేయర్ పరిచయం చేశారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీలో బెస్ట్ ప్రాక్టీసెస్, శానిటేషన్, పచ్చదనం, యస్ఎన్డీపి, సీఆర్ఎంపీ, హెచ్ సిటీ పథకాలపై యూపి సీఎంకి మేయర్ వివరించారు.
Similar News
News September 14, 2025
HYD: ‘BRS విష ప్రచారాలను తిప్పి కొట్టాలి’

గ్రూప్-1 పరీక్షపై BRS చేస్తున్న విష ప్రచారాలను ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తల తిప్పికొట్టాలని రాష్ట గ్రంథాలయ ఛైర్మన్ రియాజ్ పిలుపునిచ్చారు. హైకోర్ట్ తీర్పును తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని స్పష్టంచేశారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నారని మాట్లాడిన KTRపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని BRS నాయకులకు హితవు పలికారు.
News September 14, 2025
జూబ్లీహిల్స్‌లో ప్రజలతో మంత్రుల ముఖాముఖీ

జూబ్లీహిల్స్‌లోని సోమాజిగూడ డివిజన్‌లో జయ ప్రకాశ్ కాలనీ, ఇంజినీర్స్ కాలనీ ప్రజలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు ముఖాముఖీ నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, పలు సమస్యలు స్థానికులు మంత్రికి తెలిపారు. వారు మాట్లాడుతూ.. అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యల వినతులపై పరిష్కారం చేస్తామన్నారు.
News September 14, 2025
లిబర్టీ వద్ద మాజీ సీఎం బూర్గులకు నివాళులు

బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా లిబర్టీ క్రాస్ రోడ్‌లోని ఆయన విగ్రహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. బూర్గుల సీఎం చెరగని ముద్ర వేశారని, భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిదాయక నేతగా నిలిచారన్నారు. ఆయన దూర దృష్టి ఇప్పటికి మనందరికీ ఆదర్శమని కీర్తించారు.