News August 14, 2024
యూరప్‌లో ప్రకాశం వ్యక్తి మృతి.. సహచరుల తీరుపై అనుమానాలు

దోర్నాల మండలం హసనాబాద్‌కి చెందిన శివన్నారాయణ యూరప్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని సహచరుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘రూ. 2 లక్షలు పంపితే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తాం, రూ.10 లక్షలు పంపితే ఇండియాకు తీసుకొస్తాం’ అంటూ ఫోన్లు చేశారని, తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ చేశారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.
Similar News
News September 17, 2025
తల్లి ప్రేరేపనతోనే భార్యను హింసించిన భర్త: బంధువులు

ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడుకు చెందిన బాలాజీ భార్య భాగ్యలక్ష్మిని <<17730782>>భర్త విచక్షణారహితంగా కొట్టి<<>>న విషయం తెలిసిందే. కాగా వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వేరే మహిళతో హైదరాబాదులో ఉంటున్నాడు. భార్య స్థానికంగా ఓ బేకరీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన భర్త తనతల్లి ప్రేరేపనతో భార్యను హింసిస్తుంటాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు.
News September 16, 2025
ప్రకాశం: డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లాలోని విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ శుభవార్త చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా స్కాలర్షిప్ పొందేందుకు అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీ నుంచి పీజీ వరకు విద్యను అభ్యసించే విద్యార్థులు ఈనెల 30లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు.
News September 16, 2025
మార్కాపురం: రూ.25 వేల జీతంతో జాబ్స్

మార్కాపురంలోని ZP బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 19వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. 10 జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని, పది నుంచి పీజీ వరకు పూర్తి చేసిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ. 25వేల వరకు జీతం అందుతుందన్నారు.