News August 13, 2024

యూరప్‌‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి

image

పెద్దదోర్నాలలోని హసనాబాద్‌ గ్రామానికి చెందిన ఒంటేరు శివన్నారాయణ యూరప్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. యూరప్‌లో ఈనెల 8న స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లి రూమ్‌కి వచ్చి వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపాడు. స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ.. ఈనెల 10న శివన్నారాయణ మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 12, 2026

ప్రకాశం: నిర్మాణాలపై జేసీ సూచనలు

image

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ సంస్థకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న ఆమె బుధవారం సిబ్బందితో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, భవన నిర్మాణ అనుమతులపై జేసీ ఆరా తీశారు.

News February 11, 2026

అనుమతుల జారీలో జాప్యం ఉండరాదు: జేసీ

జిల్లా ప్రజలకు ప్రకాశం ఎస్పీ కీలక సూచనలు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రముఖ ఆలయాల వద్ద చర్యలు చేపట్టామన్నారు. ఏదైనా సాయం కోసం డయల్ 100 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.