News December 14, 2025
యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌కు ఇలా చెక్

40-50 ఏళ్లు పైబడిన మహిళల్లో యూరినరీ ఇన్‌కాంటినెన్స్(మూత్రంపై పట్టుకోల్పోవడం) సమస్య వస్తుంటుంది. దీనివల్ల తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు యూరిన్ లీకేజీ అవుతుంది. క్రమంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే 12 వారాలపాటు వ్యాయామాలు, యోగా చేస్తే ఈ సమస్యను అదుపు చేయొచ్చని ‘స్టాన్‌ఫర్డ్ మెడిసిన్’ అధ్యయనంలో తేలింది. మందులతో సమానంగా దీని ఫలితాలు ఉంటాయని వెల్లడైంది. #WomenHealth
Similar News
News December 18, 2025
కాల సర్ప దోషం ఎలా ఏర్పడుతుంది?

జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య మిగిలిన 7 గ్రహాలు (రవి, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని) ఉంటే దానినే కాల సర్ప దోషం అంటారని పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. మొత్తం 12 రకాల కాల సర్ప దోషాలు ఉంటాయట. ప్రతి దానికీ వేర్వేరు ప్రభావాలు, నివారణలు ఉన్నాయంటున్నారు. రాహుకేతువులు లగ్నం 1, 2, 7, 8వ స్థానాల్లో ఉంటే దోష ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వీటికి నివారణ మార్గాలున్నాయని వివరిస్తున్నారు.
News December 18, 2025
ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.
News December 18, 2025
కాల సర్ప దోష నివారణ మార్గాలు

రోజూ శివుడిని పూజించడం, సోమవారం శివలింగానికి పాలతో అభిషేకించడం వల్ల కాల సర్ప దోష ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. ‘శనివారం శనీశ్వరుడికి నల్ల నువ్వులు సమర్పించి 7 ప్రదక్షిణలు చేయాలి. నాగపంచమి రోజున గుడిలో నాగుల జంట ప్రతిమను దర్శించాలి. మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. నాగ ఉంగరాన్ని ధరించాలి. ఫలితంగా దోష ప్రభావం తగ్గుతుంది’ అని సూచిస్తున్నారు.


