News December 22, 2025
యూరియాను కౌలు రైతులు ఎలా బుక్ చేయాలి?

TG: కౌలు రైతులు యూరియా పొందాలంటే Fertilizer Booking App డౌన్‌లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత పట్టాదారు పాస్‌పుస్తకం నెంబర్ ఆప్షన్‌లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, యాప్‌లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయాలి. తర్వాత యాప్‌లో కనిపించే వివరాలను నింపాలి. బుకింగ్ కోడ్ రాగానే కేటాయించిన సమయంలో డీలర్ వద్దకు వెళ్లి బుకింగ్ ఐడీ చూపించి, డబ్బు చెల్లిస్తే రైతుకు యూరియా ఇస్తారు.
Similar News
News December 25, 2025
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందు బాబులకు అలర్ట్

TG: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మందు కొట్టి విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలతో తిరిగే వారిపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10వేల జరిమానాతో పాటు వెహికల్ సీజ్, గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాల్లో 304 వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Share it
News December 25, 2025
వ్యాధుల ముప్పు కోళ్లలో తగ్గాలంటే?

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.
News December 25, 2025
పెట్రోలియం జెల్లీతో ఎన్నో లాభాలు

పెట్రోలియం జెల్లీని సాధారణంగా కాళ్లు, చేతులు పగలకుండా రాసుకుంటారు. కానీ దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. * పర్ఫ్యూమ్ రాసుకునే ముందు కొంచెం పెట్రోలియం జెల్లీని చర్మంపై రాసుకోవడం వల్ల పర్ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉంటుంది. * చిట్లిన వెంట్రుకలకు తరచుగా వాజిలిన్ రాసుకోవడం వల్ల వెంట్రుకలు తిరిగి ఆరోగ్యంగా మారుతుంది. * మీ ఇంట్లో పెంపుడు జంతువుల పాదాలకు రోజూ కాస్త పెట్రోలియం జెల్లీ రాస్తే అవి సురక్షితంగా ఉంటాయి.


