News September 15, 2025

యూరియాను పక్కదారి పట్టించిన గన్‌మెన్ నల్గొండకి అటాచ్..!

image

MLG ఎమ్మెల్యే BLR గన్‌మెన్ నాగునాయక్‌ యూరియాను పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. ఈఘటనపై సీరియస్ అయిన ఎస్పీ నాగు నాయక్‌ను నల్గొండ జిల్లా కేంద్రానికి అటాచ్ చేశారు. విచారణ పూర్తయ్యాక శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 15, 2025

విషాదం.. సెలవు అడిగిన 10 నిమిషాలకే

image

‘ఆరోగ్యం బాలేదు, సెలవు కావాలి’ అని అడిగిన 10 నిమిషాలకే ఓ ఉద్యోగి గుండె ఆగి మరణించాడు. ‘శంకర్(40) అనే కొలీగ్ సిక్ లీవ్ ఇవ్వాలని ఉ.8.37 గం.కు మెసేజ్ పెట్టగా, 8.47కు కార్డియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. ఈ విషయం తెలిసి షాకయ్యాను. శంకర్‌కు ఎలాంటి దురలవాట్లు లేవు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం’ అని అతడి పై అధికారి అయ్యర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ? అనేది తెలియాల్సి ఉంది.

News September 15, 2025

ప్రెగ్నెన్సీలో డ్రైవింగ్.. సురక్షితమేనా?

image

చాలామంది గర్భిణులు ఉద్యోగం సహా ఇతర కారణాలతో ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. స్కూటీ, కారును వారే స్వయంగా నడుపుతుంటారు. అయితే డాక్టర్ సలహాతో, గుంతలు లేని రోడ్లపై నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలి. నెలలు నిండే కొద్దీ బరువు పెరుగుతారు. కాబట్టి.. ఆ సమయంలో బ్రేక్ వేయటానికి, వాహనం బ్యాలెన్స్ చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. వీలైనంత వరకు గర్భంతో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయటం తగ్గించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

News September 15, 2025

HYD: ORRపై యాక్సిడెంట్.. క్షతగాత్రలు వీరే!

image

సరళ మైసమ్మ ఆలయానికెళ్లి తిరిగి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌ PS పరిధి ORRపై <<17713246>>కారు ప్రమాదానికి<<>> గురైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు చెందిన R.సౌమ్యరెడ్డి(25), స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర, ప్రణీశ్, సాగర్, అరవింద్, జాన్సీ, శ్రుతితోపాటు మొత్తం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌమ్యరెడ్డి, నందకిషోర్‌లను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా సౌమ్య మరణించిందని CI అశోక్ రెడ్డి తెలిపారు.