News August 20, 2025

యూరియాను పక్కదారి పట్టిస్తే చర్యలు: కడప కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియాను అక్రమంగా విక్రయించడం లేదా పరిశ్రమలకు మళ్లిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీధర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టెక్నికల్ గ్రేడ్ యూరియా (TGU)ని పరిశ్రమల అవసరాలకు మళ్లిస్తున్నారన్న విషయమై వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. JDA నాయక్ పాల్గొన్నారు.

Similar News

News August 19, 2025

కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీ

image

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ మంగళవారం కర్నూల్ రేంజ్ డీఐజి కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప 2వ టౌన్‌కు సుబ్బారావు, వీఆర్‌కు గోవిందరెడ్డి, కడప SB-1కు భాస్కర్ రెడ్డి, కడప SB-2కు శివశంకర్ నాయక్, కడప SC,ST సెల్‌కు పురుషోత్తం రాజు, బద్వేలు రూరల్‌కు కృష్ణయ్య, ప్రొద్దుటూరు 3వ టౌన్‌కు వేణుగోపాల్, చింతకొమ్మదిన్నెకు నాగభూషణం, ఇంటెలిజెన్స్‌కి నాగశేఖర్‌లను బదిలీ చేశారు.

News August 19, 2025

కడప: మొదటి 2 రోజులు బార్లకు దరఖాస్తులు నిల్

image

కడప జిల్లాలో 27 బార్ల ఏర్పాటుకు సోమవారం నుంచి దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అయితే మొదటి రెండు రోజుల్లో ఒక్క దరఖాస్తు కూడా రాలేదని జిల్లా P&E అధికారి రవి కుమార్ తెలిపారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ పద్ధతుల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. కడపలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఆఫ్ లైన్‌లోను, మిగతా చోట్ల ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలుగా నిర్ణయించారు.

News August 19, 2025

కడప: ఫలితాలు విడుదల

image

కడప నగరంలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్లానింగ్, ఫైన్ ఆర్ట్స్ విభాగాలకు సంబంధించిన 2, 4, 6వ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య విశ్వనాధ కుమార్ మంగళవారం విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ అధికార వెబ్‌సైట్లో చెక్ చేసుకోవచ్చన్నారు. ఫలితాల విడుదలలో వర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డా.జి.ఫణీంద్ర రెడ్డి, ప్రకాశ్ రెడ్డి ఉన్నారు.