News August 19, 2025
యూరియా కేటాయింపులో తెలంగాణకు అన్యాయం: ఎంపీ

యూరియా కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. యూరియా సమస్యపై మంగళవారం పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీతో కలిసి ఖమ్మం ఎంపీ ప్లకార్డులతో నిరసన తెలిపారు. తెలంగాణకు రావాల్సిన మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తక్షణమే సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Similar News
News August 19, 2025
జట్టు ఎంపికపై స్పందించిన అగార్కర్

ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపిక కఠినంగా సాగిందని చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపారు. ‘అంచనాలు అందుకోవడంతోనే గిల్‌ను ఎంపిక చేశాం. అభిషేక్‌తో కలిసి గిల్, శాంసన్‌లో ఎవరూ ఓపెనింగ్ చేస్తారనేది ఇంకా డిసైడ్ చేయలేదు. శ్రేయస్ తప్పేం లేదు. అభిషేక్ బౌలింగ్ కూడా చేయగలడు. అందుకే జైస్వాల్‌ను కాదని అతడిని తీసుకున్నాం. కానీ జట్టులో 15 మందికే చోటు ఇవ్వగలం. 2026 T20 WCకి ఈ జట్టే ఫైనల్ కాదు’ అని చెప్పారు.
News August 19, 2025
రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందించాలి: కలెక్టర్

జిల్లాలో ఎరువుల కొరత రాకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మహాముత్తారం మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ ఎరువుల లభ్యత, స్టాకు వివరాలను వ్యవసాయ శాఖ ఏవో అనూషను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలన్నారు.
News August 19, 2025
రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

TG: ఇవాళ ఆసిఫాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డితో పాటు ఇతర చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.