News August 24, 2025
యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లాలో యూరియాను ఆక్వా రైతులకు మళ్లించి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. జిల్లాలో యూరియా మళ్లింపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం సాయంత్రం ఆయన పలు శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సంవత్సరం కంటే ఈ సీజన్లో దాదాపు 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా అందుబాటులో ఉంచామన్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీ కేవలం రైతులకే అన్నారు.
Similar News
News September 2, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ చల్లపల్లిలో చోరీలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్
☞ స్వమిత్వ సర్వేతో భూ సమస్యల పరిష్కారం: కలెక్టర్
☞ NTR: 13 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ ఉంగుటూరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు
☞ హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్
☞ హనుమాన్ జంక్షన్‌లో ఆటో డ్రైవర్ల ఆందోళన
News September 2, 2025
హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్

హరికృష్ణ జయంతి సందర్భంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు. ‘నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ’ అని రాసుకొచ్చారు. గతంలో ఆయనతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు.
News September 2, 2025
కృష్ణా: మీకోసం కార్యక్రమంలో 39 ఫిర్యాదులు

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రజల నుంచి 39 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను చట్టపరంగా వెంటనే విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.